Site icon TeluguMirchi.com

రాజు చేతిలో సన్నాఫ్ సత్యమూర్తి రైట్స్….

Sahyamurthi-nizamఅల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. నిన్న విడుదలయిన ఆడియో తో అబిమనులలో అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పటికే ఈ చిత్ర బిజినెస్ కూడా భారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే..తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు ఈ చిత్ర నైజాం హక్కులను 13కోట్లకు పైనే చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ధియేటర్ ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ డైలాగ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై మరింత అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మెగా అభిమానులైతే ఈ కాంబినేషన్ మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే అని సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా ఉపేంద్ర , స్నేహ , ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ మరియు రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

Exit mobile version