Site icon TeluguMirchi.com

సన్నాఫ్ సత్యమూర్తి సెన్సార్ రివ్యూ

Satyamurthy-censor-reviewసన్నాఫ్ సత్యమూర్తి…. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కాదు సినిమా ని ప్రేమించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న
చిత్రం. ‘అత్తారింటికి దారేది వంటి ఫ్యామిలీ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే, ‘రేసుగుర్రం’ వంటి సూపర్ మాస్ హిట్‌తో 50 కోట్ల క్లబ్ లో జాయిన్ ఆయె , ఇప్పుడు 70 కోట్ల క్లబ్ కోసం చూస్తున్న అల్లు అర్జున్ నుండి వస్తున్నసత్యమూర్తి చిత్రం ఫై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా సినిమాకి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తీ చేసుకొని, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతే కాక ఈ సినిమా చూసినా సెన్సార్ సభ్యులు వారి సంతోషాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తో పంచుకున్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ ఒక్కటి చాలు సినిమా ఎంతటి హిట్ అవుతుందో చెప్పడానికి అంటూ వారి అబిప్రాయాన్ని తెలిపారు. అంతటి తో ఆగకుండా చిత్రంలో నటించిన నటి నటుల కళా తీరు ను ఈ విధంగా చెప్పకొచ్చారు.

అల్లు అర్జున్ మొదటి సారిగా పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రం లో బాగా నటించాడని, ప్రకాష్ రాజ్ చిన్న పాత్ర అయిన కానీ చాలా గొప్పగా చేసాడు, నిత్య మీనన్ నటన మరో సారి నంది లేవలో ఉందని, సమంత గ్లామర్ అబిమానులను అలరిస్తుందని, త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు అంటూ సెన్సార్ చూసినా వారు చెప్పడం తో , చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అబిమానులకు ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.

Exit mobile version