మార్చి 15న ‘s/o స‌త్య‌మూర్తి’ ఆడియో…

satyamurthiస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘ s/o స‌త్య‌మూర్తి’ టైటిల్ ఖ‌రారు చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 15 న విడుదల చేయనున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ ల పై మూడు పాట‌లు చిత్రీక‌రించి మార్చి 6న యూనిట్ అంతా ఇండియా కి తిరిగి రావడం జరిగింది.

బన్నీ కి జోడిగా సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ నటిస్తున్నారు. అంతే కాకుండా కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.