Site icon TeluguMirchi.com

స్నేహ వడ్డించబోతున్న “ఉలవచారు బిర్యానీ”

తమిళ యువహీరో ప్రసన్నతో మూడుముళ్ళు వేయించుకున్న అచ్చ తెలుగందం స్నేహ సినిమాలకు కొద్ది విరామం ఇచ్చింది. ఈ భామకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో వున్న క్రేజ్ పెళ్లైయినా కూడా ఏ మాత్రం తగ్గలేదు. తమిళనాట స్నేహ జ్యువెలరీ, వస్త్రదుకాణాల వాణిజ్య ప్రకటనల్లో అగ్ర భాగాన దూసుకుపోతోంది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ తమిళ అనువాద చిత్రంతో రానుంది స్నేహ. ప్రకాష్‌రాజ్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తమిళంలో… మలయాళంలో విజయం సాధించిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ చిత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. స్నేహ ఇందులో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్రను స్నేహ పోషిస్తుందని తెలిసింది. తెలుగులో ‘ఉలవచారు బిర్యానీ’ పేరుతో ఈ చిత్రం అనువాదం కాబోతుంది. పెళ్లి తర్వాత స్నేహ నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం.

Exit mobile version