Site icon TeluguMirchi.com

షాకింగ్ విషయాన్ని షేర్ చేసిన సింగర్ స్మిత

మొక్కజొన్న తోట‌లో…, మ‌స‌క మ‌స‌క చీక‌టిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయినా స్మిత‌ తాజాగా షాకింగ్ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాయని ..తనకు ఇష్టమైన పనులను ఇంట్లోనే చేసుకుంటూ హ్యాపీ గా ఉన్నానని చెప్పిన ఈమె..వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు చాలా కీల‌క‌మైన‌వి. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న కాలం ఇది. ఆస్ట్రాల‌జీ ప్రకారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌స్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్రహాలు మూడూ క‌లుసుకోబోతున్నాయి.

జ్యోతిషం ప్రకారం ఇది చాలా ప్రమాద‌క‌రం. అంటే ఆ స‌మ‌యంలో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌డానికి అవ‌కాశం ఉంది. ఈ టైమ్‌లో మ‌నం బ‌య‌ట‌కు వెళ్లక‌పోవ‌డం చాలా ముఖ్యం. ఈ రోజు (మార్చి 30) రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి స‌రుకులు కొన‌డం మానుకొని, ఇంట్లో ఉన్నవాటితో స‌రిపెట్టుకొంటే మంచిది. అలాగే వేడి నీళ్లలో ప‌సుపు, తుల‌సి, వాము క‌లిపి.. ఆవిరి ప‌ట్టుకుంటే వైర‌స్ దూరంగా తొల‌గిపోతుంది. ఆవిరి ప‌ట్టిన కొద్దిసేప‌టి వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాతే ముఖం క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకున్నవాళ్లమ‌వుతాం అంటూ ఓ వీడియో షేర్ చేసింది.

Exit mobile version