Site icon TeluguMirchi.com

‘స్కంద’ ఫస్ట్ సింగిల్.. రామ్, శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసారుగా !


బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ టైటిల్ గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా లో దూసుకు వెళ్ళింది. ది ఎటాకర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ మరియు బోయపాటి శ్రీను, రామ్‌ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌ లో చూపించాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ గా రాబోతుంది. ఇకపోతే తాజాగా నేడు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

“నీ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన.. నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా.. నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా..” అంటూ సాగే ఈపాటలో రామ్, శ్రీలీల ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. ఇద్దరూ కూడా స్టెప్పులతో అదరగొట్టేసారు. ఈ పాటకు రఘురామ్‌ సాహిత్యం అందించగా.. సిద్‌ శ్రీరామ్‌, సంజన కల్‌మంజీ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బీట్స్​కు తగ్టట్లుగా రామ్, శ్రీలీల వేసిన స్టెప్పులు సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కోరియోగ్రఫీ చాలా బాగుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు మరియు నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Nee Chuttu Chuttu (Lyrical Video) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu | Thaman S

Exit mobile version