రమ్యకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… నా పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పగానే వెంటనే శివగామిగా మారిపోయి ఒకే చెప్పాను. కథలో నా పాత్రకు అంత మంచి స్థానం కల్పించి ‘బాహుబలి’లో కీలకమై పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను, నిజానికి శివగామి పాత్ర క్రెడిట్ అంతా కూడా రాజమౌళిదే. ఇక శివగామిలా ఊహించుకుంటూ నా పాత్ర మొత్తం చేసేశాను కానీ చిన్నపాపను ఎత్తుకుని నీటిలో నడిచే సీన్‌కు మాత్రం చాలా కష్పడ్డాను. నీటిలోకి దిగగానే చాలా భయం వేసేది కానీ రాజమౌళి పక్కనే ఉండి శివగామికి భయం ఉండదు అని చెబుతుంటే ఆ భయం పోయేది. అలా నీటిలోని సీన్‌ను మొత్తం వారం రోజులు చేశాం, అది కేరళలోని చల్లకుడి వాటర్ ఫాల్స్ వద్ద చేశాం, ఆ సీన్ నన్ను బాగా కష్టపెట్టింది తప్పితే సినిమా మొత్తం శివగామిలా జీవించి చేశాను అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.