మరో రెండు రోజుల్లో దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం విడుదల కాబోతుంది. మొదటి పార్టు విడుదలయినప్పటి నుండి రెండో పార్టు కోసం మొదటి పార్టు చూసిన వారంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండో పార్టు మరో రెండు రోజుల్లో అనగానే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఇక ‘బాహుబలి 2’ టీం అంతా కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటున్నారు. టీం అంతా కూడా మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో కీలెుౖన పాత్రలో నటించిన శివగామి రమ్యకృష్ణ తాజాగా మీడియాతో ముచ్చటించింది.
రమ్యకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… నా పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పగానే వెంటనే శివగామిగా మారిపోయి ఒకే చెప్పాను. కథలో నా పాత్రకు అంత మంచి స్థానం కల్పించి ‘బాహుబలి’లో కీలకమై పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను, నిజానికి శివగామి పాత్ర క్రెడిట్ అంతా కూడా రాజమౌళిదే. ఇక శివగామిలా ఊహించుకుంటూ నా పాత్ర మొత్తం చేసేశాను కానీ చిన్నపాపను ఎత్తుకుని నీటిలో నడిచే సీన్‌కు మాత్రం చాలా కష్పడ్డాను. నీటిలోకి దిగగానే చాలా భయం వేసేది కానీ రాజమౌళి పక్కనే ఉండి శివగామికి భయం ఉండదు అని చెబుతుంటే ఆ భయం పోయేది. అలా నీటిలోని సీన్‌ను మొత్తం వారం రోజులు చేశాం, అది కేరళలోని చల్లకుడి వాటర్ ఫాల్స్ వద్ద చేశాం, ఆ సీన్ నన్ను బాగా కష్టపెట్టింది తప్పితే సినిమా మొత్తం శివగామిలా జీవించి చేశాను అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.