న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ పై తళుక్కుమన్న సితార..


న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచంలోని అత్యధికంగా సందర్శించే పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అలాంటి టైమ్స్ స్క్వేర్ పై ఘట్టమనేని వారసురాలు, మహేష్ బాబు కూతురు సితార ఫోటోలు కనిపించాయి. ప్రస్తుతం సితార పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్నారు. ఇక ఈ సంస్థ ‘సితార కలెక్షన్స్’ పేరుతో ఓ స్పెష‌ల్ బ్రాండ్‌ని కూడా సృష్టించింది. దీనికి సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ప్ర‌క‌ట‌న‌ని న్యూయార్క్ లోని ప్ర‌ఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్ర‌ద‌ర్శించడం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఈరోజు అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా టైమ్స్ స్క్వేర్ పై సితార కమర్షియల్ యాడ్ ను స్క్రీనింగ్ చేయడం పట్ల, మహేష్ బాబు అభిమానులు తండ్రికి తగ్గ తనయురాలు అంటూ చాలా సంతోషపడుతున్నారు. ఇక తన మొదటి యాడ్ ఈ రేంజ్ లో లాంచ్ అవ్వడం అనేది సితార కి నిజంగా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అంతేకాదు దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ.. నీ గురించి చాలా గర్వంగా వుంది నా ఫైర్ క్రాకర్.. నువ్వు ఇలాగే ప్రకాశిస్తూ ఉండాలి అన్నారు.