ఏప్రిల్ 8న ‘సింగం 123’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

singam123కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న చిత్రం ‘సింగం 123’. హృదయకాలేయంతో తెలుగు ప్రేక్షకులకు బర్నింగ్ స్టార్ గా దగ్గరైన సంపూ చేస్తున్న ఈ మోస్ట్ అవెయిటింగ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.