Site icon TeluguMirchi.com

సింగర్‌ సుచిత్రను కిడ్నాప్‌ చేశారు..!

suchitraతమిళ గాయని సుచిత్ర పలువురు తారల వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేసి పెను ధుమారం రేపింది. ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుందా అనే వార్తలకు సుచిలీక్స్‌ పేరిట నిదర్శణాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా సుచిత్రనే కావాలని చేసిందా..?? లేదా ట్విట్టర్‌ ఖాతా నిజంగా హ్యాక్‌ అయ్యిందా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. సుచిత్ర ట్విట్టర్‌ ఖాతా ద్వారా లీకయిన ప్రయివేటు ఫొటోల వల్ల ఆ తారల జీవితాల్లో సమస్యలు మొదలయ్యాయట. ఈ లీక్‌లలో ఉన్న పెద్ద తలలు కలిసి సుచిత్రను కిడ్నాప్‌ చేయించారని తమిళ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని, లండన్ చికిత్స చేయించుకోవడానికి వెళుతుందని ఆమె భర్త కార్తీక్‌ కుమార్‌ అధికారికంగా ప్రకటించాడు. కానీ తాజాగా తమిళననాడులో సుచిత్ర సన్నిహితులు మాత్రం సుచిత్రను ఎవరో కిడ్నాప్‌ చేశారు అని అంటున్నారు.

సుచిత్ర లీకులలో బయటపడ్డ వారే కుట్ర చేసి ఆమెను కిడ్నాప్‌ చేసి, తన దగ్గర ఉన్న సమాచార మంతా తీసుకుని ఆ తర్వాతే వదులుతారట అని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఎవరు స్పందించకున్నా కూడా తమిళ మీడియాలో మాత్రం ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. మరి నిజంగా సుచిత్రను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా అనేది లేనిది ఆమె స్పందిస్తేనే తెలుస్తుంది.

Exit mobile version