లండన్‌కు సుచిత్ర.. చికిత్స కోసమా? తప్పించుకోవడానికా?

suchitra
కోలీవుడ్‌ సింగర్‌ సుచిత్ర కార్తీక్‌ తాజాగా సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేసి సోషల్‌ మీడియాలో పెను ధుమారం రేపింది. మొదటగా తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తనని రేప్‌ చేశాడనే ట్వీట్‌తో మొదలు పెట్టిన సుచిత్ర చివరకు జెనీలియా నగ్న ఫొటో వరకు చాలా మంది రహస్య జీవితాన్ని బయట పెట్టింది. ఈమెను ఎవరైనా ఎదురిస్తే మీ వ్యవహారం కూడా చూసుకుంటారా..? అనే తీరుగా ఎదురుదాడి చేసింది. సుచిత్ర పేరుతో అనేక ఖాతాలు పరిచయం అయ్యి లీకుల పరంపర సాగుతూనే ఉంది. మొదటగా హ్యాక్‌ అని చెప్పిన కార్తీక్‌ కుమార్‌ ఆ తర్వాత లీక్‌ అని చెప్పకనే చెప్పాడు. సుచిత్ర చేస్తున్న వికృత  చేష్టలపై తమిళ సినీ పరిశ్రమ మొత్తం కూడా విమర్శలు చేయగా సుచిత్ర భర్త కార్తీక్‌ కుమార్‌ ఆమె మానసిక సమస్యలతో బాదపడుతుందని, దయచేసి అర్థం చేసుకోండి అంటూ విన్నవించుకున్నాడు.

సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన గాయని సుచిత్ర త్వరలో లండన్‌ చెక్కేయనుంది. మానసిక సమస్యలతో బాదపడుతున్న సుచిత్ర చికిత్స కోసమే లండన్‌ వెళుతున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాని ఈమె బాగోతం అంతా చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగా చికిత్స కోసమే వెళుతుందా.?? లేదా ఇక్కడ రేపిన ప్రకపంణలు తన చుట్టూ ముడుతాయని భయంతో తప్పించుకోవడానికి లండన్ వెళుతుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి సుచిత్ర విడుదల చేసిన ఫొటోలతో తారలంతా ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మాత్రం సుచిత్ర లీక్‌ చేసిన ఫొటోలు మొత్తం కూడా కేవలం మార్ఫింగ్‌ మాత్రమే అవి నిజమైన ఫొటోలు కావంటూ విమర్శలు చేస్తున్నారు.