శింబు, హన్సిక ఒప్పుకొన్నారు!

simbu-hansikన‌య‌న‌తార తూచ్ చెప్పి వెళ్లిపోయాక‌…. శింబు దేవ‌దాసు అయిపోలేదు. ఇంకో పార్వతిని వెదికిప‌ట్టుకొన్నాడు. త‌నే…. హ‌న్సిక‌. వీరిద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తోంద‌నే టాక్ గ‌త కొంత‌కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ వీరిద్దరూ ఎప్పుడూ బ‌య‌ట ప‌డ‌లేదు. ఇప్పుడు మాత్రం.. ఔను మేం ప్రేమ‌లో ఉన్నాం… అని చెప్పేసుకొంటున్నారు. ”శింబుని ప్రేమిస్తున్నా. ప్రస్తుతానికి అదొక్కటే చెప్పగ‌ల‌ను. మరేం అడ‌క్కండి..” అని ట్విట్ చేసింది హన్సిక‌. శింబు కూడా గొంతు క‌లిపాడు. ”మేం పెళ్లిచేసుకోబోతున్నాం. కానీ ఇప్పుడు కాదు.. ఇంకాస్త స‌మ‌యం ఉంది..” అని శింబు చెప్పాడు. ఇద్దరి పెళ్లికీ ఇంట్లో వాళ్లు ఒప్పుకొన్నార‌ని అందుకే ఒక్కసారిగా బ‌య‌ట‌ప‌డిపోయార‌ని టాక్‌! మ‌రి ప‌ప్పన్నం ఎప్పుడు పెడ‌తారో చూడాలి.