Site icon TeluguMirchi.com

‘సిల్లీ ఫెలోస్’ డేట్ ఫిక్స్ చేసుకున్నారు..

గత ఐదేళ్లుగా హిట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి లో అల్లరి నరేష్ ఉన్నాడు. ఎన్ని కథలతో వచ్చిన కానీ హిట్ మాత్రం ఈయన ఖాతాలో పడడం లేదు. దీంతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన భీమినేని శ్రీనివాస్ ను నమ్ముకొని వస్తున్నాడు. ఇతడొక్కడే కాదు ఇతనితో పాటు మరో ప్లాపుల హీరో సునీల్ ని కూడా జత కలుపుకొని ‘సిల్లీ ఫెలోస్’ గా వస్తున్నారు.

సుడిగాడు చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెట్టుకుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు పెద్దగా స్పందన ఏమి రాకపోయేసరికి కాస్త గ్యాప్ ఇచ్చి తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 7న మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఫై ఈ ఇద్దరు గట్టి ఆశలే పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు హీరోలు వేరే హీరోల చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నరేష్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం లో కీలక పాత్ర చేస్తుండగా, సునీల్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హీరోగా ఒకవేళ సక్సెస్ అందుకోలేకపోయిన ఈ రెండు చిత్రాలతో మాత్రం మళ్లీ బిజీ కావడం ఖాయమని ఫిక్స్ అయ్యారు.

Exit mobile version