Jack : నవ్విస్తూనే బాధ్యతను గుర్తు చేస్తా – సిద్ధు జొన్నలగడ్డ


Jack : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ‘కిస్’ అనే రొమాంటిక్ సాంగ్ కూడా విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్ లోకి వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. తాజాగా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ వైష్ణవి చైతన్య సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సినిమాపై నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

Also Read : ఆకట్టుకుంటున్న ‘చౌర్య పాఠం’ నుంచి ‘ఆడ పిశాచం’ సాంగ్..

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే టైటిల్ కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌ను సూచిస్తుందని చెప్పారు. ప్రతి మనిషికి ఓ లక్ష్యం ఉంటుంది, కానీ దాన్ని సాధించే విధానం వ్యక్తిగతంగా మారవచ్చని చెప్పిన సిద్ధు, తన పాత్ర నవ్విస్తూనే బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుందని వెల్లడించారు. రైటర్‌గా కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చినట్టు చెప్పిన ఆయన, భాస్కర్ దాన్ని కథకు తగ్గట్టుగా డెవలప్ చేసినట్టు తెలిపారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుండగా, ఇది అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్మకంగా చెప్పారు.