సిద్దార్థ్ మ‌రో పాట‌

Siddharthసిద్దార్థ్ స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భుడ‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అప్పుడ‌ప్పుడూ గొంతు స‌వ‌రించుకొంటూనే ఉంటాడు. బొమ్మ‌రిల్లు నుంచి ఓమై ఫ్రెండ్ వ‌ర‌కూ అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా… పాట పాడుతూనే ఉన్నాడు. కొత్త సినిమా ఎన్‌హెచ్ 4 సినిమా కోసం మ‌రోసారి మైకు అందుకొని పాట పాడాడు. అన్న‌ట్టు ఈ చిత్రానికి నిర్మాత కూడా సిద్దూనే. జివి ప్ర‌కాష్ స్వ‌ర‌క‌ర్త‌. మ‌ణిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. చెన్నై, బెంగ‌ళూరు నేష‌న‌ల్ హైవే మ‌ధ్య సాగించిన ప్ర‌యాణంలో క‌థానాయ‌కుడికి ఎదురైన అనుభ‌వాల‌ను ఉత్కంఠ భ‌రితంగా తెర‌కెక్కించార‌ట‌. ఈ సినిమా తెలుగు, తమిళ భాష‌ల్లో ఈ సినిమాని త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తారు.