Site icon TeluguMirchi.com

సంగీత దర్శకుడుగా ‘ఉండిపోరాదే..’ సింగర్

 

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు ఒకప్పుడు ఇళయరాజా సంగీతం అందించేవారు.  అయితే ‘రోజా’ సినిమాలో ఏఆర్‌ రెహ్మాన్‌ను పరిచయం చేసి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తున్నారు మణిశర్మ. తన మెడ్రాస్‌ టాకీస్‌ నిర్మాణ సంస్థలో చేసే  సినిమాలకు ఇతర సంగీత దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే తాజాగా తన శిష్యుడు ధనశేఖరన్‌ దర్శకత్వంలో ‘వానం కొట్టట్టుం’ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి సింగర్ సిద్‌ శ్రీరాం సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు. తమిళంలో ‘ఎన్నోడు నీ ఇరుందాల్‌’ (ఐ), ‘కురుంబా కురుంబా..’ (టిక్‌ టిక్‌ టిక్‌), ‘కన్నాన కన్నే..’ (విశ్వాసం) వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకున్న సిద్‌ శ్రీరాం.. తెలుగులో కూడా ‘ఉండిపోరాదే..’ వంటి పలు హిట్‌ పాటలతో యువతను ఉర్రూతలూరించారు.

కాగా ఏఆర్‌ రెహ్మాన్‌ నుంచి అనిరుధ్‌ వరకు పలువురి సంగీతంలో పాటలను ఆలపించారు సిద్ శ్రీరాం. ఇప్పుడు మణిరత్నం నిర్మాణంలోని సినిమాకు ఆయన సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలో విక్రంప్రభు, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిరత్నం  స్వయంగా కథ, మాటలు అందించడం విశేషంగా చెప్పవచ్చు.

Exit mobile version