కలకత్తా సెట్ లో శ్యామ్ సందడి..

నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాతతరం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. అందుకే హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా కలకత్తా నేపథ్యాన్ని తీసుకురావడానికి సెట్ వేశారు. రేపటి నుండి ఆ సెట్ లోనే షూట్ చేయనున్నారు. కాగా ఈ సినిమా కథ కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట.

ఇక ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారు. సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లు నిన్నటి వరకు వినిపించాయి.  కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి నాగ వంశీ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈయన ప్లేస్ లో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే నాని ‘వి’ సినిమాతో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా మొదలుఅయ్యింది.