అత‌ను ఉద్యోగం కోసం వ‌చ్చాడ‌ట‌!

sruthihasanశ్రుతిహాస‌న్ ఇంటి త‌లుపు త‌ట్టి.. దౌర్జన్యంగా లోప‌లికి రావ‌డానికి ప్రయ‌త్నించింది ఎవ‌రో.. తెలిసింది. అత‌ని పేరు.. అశోక్ శంక‌ర్‌. ముంబై ఫిల్మ్ సిటీలో ప‌నిచేస్తుంటాడు. కొంత‌కాలంగా శ్రుతిని ఫాలో అవుతున్నాడు. ఇది వ‌ర‌కు కూడా అత‌ను శ్రుతిని ఇలాగే ఇబ్బందుల‌కు గురిచేశాడ‌ని తెలుస్తోంది. హిందీ చిత్రం రామ‌య్యా వ‌స్తావ‌య్యా షూటింగ్ లోనూ అత‌ను శ్రుతి వెంట ప‌డ్డాడ‌ట‌. పెళ్లిచేసుకో.. అని వేధించాడ‌ట‌. కారుకి అడ్డం ప‌డేవాడ‌ట‌. ఇప్పుడు ఇంటికి కూడా వ‌చ్చేశాడు. అదీ మంచికే అయ్యింది. సీసీ కెమెరాల ద్వారా అత‌నెవ‌రో అర్థమైంది. ముంబై పోలీసుల‌కు శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు… అక్క‌డ పోలీసులు కేసు న‌మోదు చేశారు. 24 గంట‌ల్లోగా అశోక్‌ని ప‌ట్టుకొన్నారు. మా త‌మ్ముడికి ఉద్యోగం అడ‌గ‌డానికే వ‌చ్చా.. మ‌రే ఉద్దేశం లేద‌ని అశోక్ చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఆశోక్‌కి లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఇచ్చే ప‌నిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో శ్రుతి ఇంటికి అద‌న‌పు బందోబ‌స్తును కూడా ఏర్పాటు చేశారు.