Site icon TeluguMirchi.com

మ‌హేష్ ఐటెమ్ గాళ్ … శ్రుతి

suthi
ఆగ‌డు ట్రైట‌ర్ చూస్తుంటే… మాస్‌కి వినోదాల విందు అనే విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంది. ఈ సినిమాలో మరింత‌ మ‌సాలా ద‌ట్టించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. త‌మ‌న్ చేత అదిరిపోయే ఐటెమ్ సాంగ్ చేయించాడ‌ట‌. ఆ పాట‌లో ఓ టాప్ హీరోయిన్ క‌నిపిస్తే మ‌రింత మ‌జా వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ర‌క‌ర‌కాల పేర్లు ప‌రిశీలించాక‌.. చివ‌రికి శ్రుతిహాస‌న్ ద‌గ్గ‌ర ఆగారు. ఈ విష‌య‌మై చిత్ర‌బృందం శ్రుతిని సంప్ర‌దిస్తే… ఆమె కూడా ఓకే అంద‌ట‌. ఇంకేం… మ‌హేష్‌కి స‌రికొత్త ఐటెమ్ గాళ్ దొరికేసిన‌ట్టైంది. మ‌హేష్‌బాబు – కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోంది. అందులో క‌థానాయిక‌గా శ్రుతిహాస‌న్ పేరు ప‌రిశీలిస్తున్నారు. ఆగ‌డులో ఐటెమ్ పాట‌.. అందుకే ఓ డెమోగా ఉప‌యోగ‌ప‌డుతుందేమో చూడాలి.

Exit mobile version