Site icon TeluguMirchi.com

మహేష్ తో రెండుసార్లు..

dlhkwop9

శృతి హాసన్ నక్కతోక తొక్కినట్లుంది. మహేష్ బాబుతో ఒకసారి జతకట్టడమే అదృష్టంగా భావిస్తున్నారు కథానాయికలు. అలాంటిది.. శృతి మహేష్ తో రెండు సార్లు జతకట్టనుంది. అది కూడా ఒకే సమయంలో కావడం విశేషం.  మహేష్ – మణిరత్నం కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా, మహేష్ తో కొరటాల శివ రూపొందించే మూవీలోనూ శృతినే తీసుకున్నారని టాలీవుడ్ సమాచారమ్. కథానుగుణంగా శృతి అయితేనే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట. ఇందుకు మహేష్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకేం.. మహేష్ తో శృతి రెండు సార్లా… అని టాలీవుడ్ కోడైకూస్తుంది. అదృష్టమంటే ఇదేనేమో.. !

Exit mobile version