అందాలతార శృతిహాసన్ వరుస సినిమాలతో చాలా బిజీ అవుతోంది. ఈ అమ్మడు కమల్ హాసన్ వారసత్వంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన టాలెంట్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్‌గా బిజీ అయిన శృతికి మనస్సులో ఒకటి బయటకు ఒకటి లాగా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటుంది. ఏది ఉన్నా కూడా అలా ధైర్యంగా అలా చెప్పే శృతికి చాలామందితో ఎఫైర్ సాగిందని వార్తలు వచ్చాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన శృతిని గత ఎఫైర్ల గురించి అడిగితే అవును నాకు కొన్ని ఫెయిల్యూర్ వ్ స్టోరీస్ ఉన్నాయి అని పాజిటివ్‌గానే స్పందించింది.
గత లవ్‌స్టోరీల గురించి సహజంగా ఎవరు కూడా అలా స్పందించరు కానీ శృతి మాత్రం ముక్కుసూటి మనిషి కాబట్టి అలా చెప్పేసింది. తాను ఎక్కువగా పని మీద శ్రద్ద పెడుతాను కాబట్టే కొంత మంది అది నచ్చక దూరం అయ్యారని అంటోంది. అంతేకాకుండా మనల్ని ప్రేమించే వారు మనం చేసే పనిని కూడా ప్రేమించాలి అంటూ శృతి చెబుతోంది. అప్పుడే ఇద్దరు సుఖంగా ఉంటారు అందుకే తదుపరి అలాగే చూడాలని ఫిక్స్ అయ్యా, కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు ఇప్పుడు పూర్తి దృష్టి కెరియర్ మీదనే అని శృతి చెప్పుకొచ్చింది.