టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పద్దతి చాలా ఎక్కువ అని, అందుకే తాను తెలుగు చిత్రాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు అంటూ సంచలన కామెంట్లు చేసిన కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ తాజాగా బెంగుళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర సందేశాలు పెడుతున్నారని, తన ఫొటోను అసభ్యకర ఫొటోతో మార్ఫింగ్ చేసి సదరు మార్ఫింగ్ ఫొటోను షేర్ చేస్తూ ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని, సదరు ఆకతాయిల ఆట కట్టించవలసిందిగా శృతి హరిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆకతాయిలు తన ఫొటోను ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుండడం వల్ల తనకు చాలా ఇబ్బంది కలిగిందని, తాను మానసికంగా క్షోభ పడుతున్నాని, ఎలాగైనా దుండగులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకపై తనపై ఇలాంటి చర్చలు చేయాలని ఆలోచించే వారికి వణుకు పుట్టాలని, అందుకే కఠినంగా శిక్షించాలని శృతి హరిహరన్ పోలీసులకు పిర్యాదు చేసింది.