Shraddha Srinath : ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘డాకు మహారాజ్’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’ విడుదలకు సిద్ధమవుతోంది. యువ దర్శకుడు ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో, కె.ఎస్. రామకృష్ణ నిర్మాణంలో ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తుంది. ఇప్పటికే మణిరత్నం చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ట్రైలర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన వర్మ, “కలియుగమ్ 2064 ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఫోటోగ్రఫీ, క్యారెక్టర్స్ డిజైన్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్నీ మోడరన్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి” అని ప్రశంసించారు.
Also Read : Sree Vishnu : శ్రీ విష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ లాక్ !!
ఇక ట్రైలర్ చూస్తే, 2064లో ఏర్పడే విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మనుషులు ఆహారం, నీరు, మానవత్వం కోసం చేసే పోరాటాన్ని ఆవిష్కరించారు. సమాజం విలువలు పతనం అవుతున్న సమయంలో, కలియుగ ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకుని సినిమా రూపొందించబడింది. వి ఎఫ్ ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు పి.సి. శ్రీరామ్ శిష్యుడు కె. రాంచరణ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రేక్షకులను భిన్నమైన అనుభూతికి లోను చేసేలా కలియుగమ్ 2064 రూపొందిందని చిత్ర యూనిట్ భావిస్తోంది.