కేరాఫ్ కంచరపాలెం మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెలుతుంది. కంచరపాలెం అనే ఊరికి చెందినవాళ్లే 52 మంది ఇందులో నటించారు. దర్శకుడు మహా రాసుకున్న సున్నితమైన ప్రేమ కథలు కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం అబ్బురపరుస్తుంది. స్వీకర్ అగస్తి సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది.
మొదటిది ఆ ఊరికి చెందిన రాజు (సుబ్బారావు) ఓ అటెండర్ 49 ఏళ్లు వచ్చినా… పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుంటాడు. అతను పనిచేసే ఆఫీసుకి అధికారిగా ఒడిశా నుండి వస్తుంది రాధ. భర్త చనిపోయిన ఆమెకు ఇరవయ్యేళ్ల కూతురు ఉంటుంది. అటెండర్ అయినా రాజు మంచి మనసుని చూసి రాధ ప్రేమలో పడుతుంది. రెండవది జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)లది మరో కథ.
మూడవది ఊళ్లోని వైన్ షాప్‌లో పనిచేసే గడ్డం (మోహన్ భగత్) కూడా, సలీమా(విజయ ప్రవీణ) అనే వేశ్య కళ్లని చూసి ప్రేమిస్తాడు. నాల్గవది స్కూల్‌కి వెళ్లే సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ) ల కధ. మరి వీరి ప్రేమకథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయో తెలియాలంటే తప్పని సరిగా కంచెర పాలెం వెల్లంసిందే.
కొన్ని జీవితాల్ని గోడ చాటు నుంచి చూస్తే ఎలా ఉంటుందో, అలాంటి అనుభూతిని పంచే చిత్రమిది. ప్రధానంగా సినిమా చూస్తున్నంత సేపు కంచెర పాలెం అనే ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిన్న సినిమాను ప్రోత్సహించి, మంచి సినిమాను మనందరికీ అందించిన రానా కు కృతజ్ఞతలు.