గతంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన చాలా భాదపడ్డాడు కానీ చివరకు ఆయనే ఆత్మహత్య చేసుకోవడం నన్ను కలచివేసింది. రంగనాథ్ గారు చనిపోయినపుడు నేను చిరంజీవి గారు కలిసి రంగనాథ్ నివాసాన్ని వెళ్లి ఆయన పార్థీవ దేహాన్ని మా కార్యాలయంకు తీసుకొచ్చి పెట్టాం. ఈయన నివాసం చాలా దూరంగా ఉండడం వల్ల పరిశ్రమలోని వారంతా రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో కార్యాలయానికి తీసుకువచ్చాం.
కానీ ఆ సమయంలో పార్టీ ఆఫీసుకు పార్థీవ దేహాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఒక సీనియర్ నేత మా అందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో నాకు కోపం వచ్చి చెప్పుతో కొడుతా మిమ్మల్ని అంటూ తయనపై నోరు లేపాను అంటూ శివాజీరాజా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఆయన నాకంటే పెద్ద స్థాయి వ్యక్తి అయినా కూడా సంస్కారంలో మాత్రం ఆయన నా కాలు గోటికి కూడా సరిపోడు అంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఆ సీనియర్ నటుడు ఎవరు అనేది మాత్రం బయటకు చెప్పలేదు