10 కోట్ల ఆఫర్‌ కాదంది

సెలబ్రెటీలు తమ స్థాయికి తగ్గట్లుగా ఏదో ఒక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. కొందరు కోట్ల రూపాయలను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తీసుకుంటూ ఉంటారు. శిల్పా శెట్టి ఎన్నో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు సౌత్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. అందుకే ఈ అమ్మడు పలు కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. తాజాగా వెయిట్‌లాస్‌కు సంబంధించిన ఔషదం గురించి ప్రమోట్‌ చేయాల్సిందిగా ఈమె వద్దకు కంపెనీ వారు వెళ్లడం జరిగిందట.

వెయిట్‌ లాస్‌ ట్యాబ్లెట్స్‌ అనేవి ఏమాత్రం పని చేయవని, ఒకవేళ పని చేసినా సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటాయి, భవిష్యత్తులో మంచిది కాదు అంటూ డాక్టర్లు సైతం అంటూ ఉంటారు. అలాంటి ట్యాబ్లెట్లకు ఆను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయను అంటూ శిల్పా శెట్టి చెప్పేసిందట. ఏకంగా 10 కోట్ల రూపాయలను ఆఫర్‌ చేసినా కూడా నో అంటూ తేల్చి చెప్పింది. మొత్తానికి తాను నమ్మినదాని కోసం ఏకంగా పది కోట్లను ఈ అమ్మడు వదిలేసింది. యోగా చేసి వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు అంటూ ఈమె ప్రచారం చేస్తూ ఉంటుంది.