షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న నిక్కమా అనే చిత్రంలో కీలక పాత్రలో ఈమె కనిపించబోతుంది. హీరోయిన్ పాత్రలను కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను ప్రత్యేక పాటలను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. యోగా బ్యూటీగా పేరున్న ఈ అమ్మడికి అప్పటికి ఇప్పటికి తేడా ఏమీ లేదు. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మడు ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మంచి అందంతో ఉంది. అందుకే ఈమెకు హీరోయిన్గా కూడా ఆపర్లు వస్తాయని అంటున్నారు. సౌత్‌లో ఈమె నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అందుకే ఇక్కడ కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.