మొదటి వారంలో శిల్పని ఎవరు నామినేట్ చేయవద్దని బిగ్‌బాస్ ఆదేశించాడు. తర్వాత శిల్పా ఇంట్లోకి వెళ్లిన రెండో వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యింది. అయితే ఈ వారం శిల్పనే ఎలిమినేట్ అవుతుంది, ఆమెకు తక్కువ ఓట్లు నమొదయ్యాయి అని వార్తలు వచ్చిన్పటికి వాటిని నమ్మడానికి లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా తొలి నామినేషన్లోకి రాగానే ఔట్ అవుతున్నారు. ఇతర ఇంటి సభ్యులు కూడా తొలిసారిగా ఎలిమినేషన్లోకి రాగానే ఔట్ అయ్యారు. ఈ సీజన్లో మొదటి నుండి నామినేషన్లో ఉన్నవారే ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉండడం గమనార్హం.