నయనతార ది సెకెండ్ కేటగిరి

nayan
‘ఓ ఆర్టిస్టుగా నిర్మాతల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ… సినిమా మనది అనుకొని భావించే వాళ్ళు కొందరు. సినిమాను ఒక ఉద్యోగంలా చేసేసి డబ్బులు తీసుకొని వెళ్లే పోయేవారు మరి కొందరు. నయనతార రెండో కేటగిరికి చెందిన హీరోయిన్’ అంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ములు. నయన తార హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘అనామిక’. బాలీవుడ్ ‘కహానీ’ చిత్రానికి రీమేక్ ఇది. హిందీలో విద్యా బాలన్ పోషించిన పాత్రను తెలుగులో నయన తారా పోషించింది. ఈ చిత్రం షూటింగ్ డేట్స్ , ప్రమోషన్ విషయంలో ‘అనామిక’ యూనిట్ కు నయన్ ఇబ్బంది పెట్టిందని టాక్ నడించింది.

తాజాగా ఈ విషయం పై స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల , నయన్ భిహేవియర్ పై కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ‘సినిమా ప్రమోషన్ విషయంలో దూరంగా ఉండాలనేది నయన్ పాలసీ అనుకుంటా. అయితే..హీరో ఉన్న సినిమాలకు ప్రమోషన్‌కి రాకపోయినా ఫర్లేదు. తనే లీడ్ రోల్ చేస్తున్న ‘అనామిక’ లాంటి చిత్రానికి తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని నయన్ కు చెబితే… ప్రమోషన్ కు రావడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పిసింది. సినిమాను ఒక ఉద్యోగంలా చేసేసి డబ్బులు తీసుకొని వెళ్లే పోయేవారు కొందరు వుంటారు. నయన తారది ఇదే కేటగిరి. హీరోయిన్లపై ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసేవాళ్లే లేరు. కానీ తీశారు. నాకైతే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని ఉంది. ఆ ఆలోచన తనకూ ఉండాలిగా? అంటూ చురకటించాడు శేఖర్. మరి, శేఖర్ కమ్ముల మాటలు వినైనా నయన్ పద్దతి మార్పు వస్తుందేమో చూడాలి.