Site icon TeluguMirchi.com

Sharwanand : శర్వానంద్ బర్త్ డే స్పెషల్.. ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్


ఈరోజు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా.. ప్రస్తుతం శర్వా చేస్తున్న, అలాగే చేయబోయే సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ తన 35వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈరోజు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ చేసారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే ఆహ్లాదకరమైన టైటిల్ ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. పోస్టర్‌లో శర్వానంద్ మరియు చిన్నారి-విక్రమ్ ఆదిత్య చేతిలో పెయింట్ రోలర్‌లతో నిలబడి ఉన్నారు. చూస్తుంటే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్ధమవుతుంది.

World of Manamey | Sharwanand | KrithiShetty | Sriram Adittya |TG Vishwa Prasad | Hesham Abdul Wahab

ఇక శర్వా తన 36వ సినిమా అయితే మంచి అడ్వెంచర్ రైడ్ గా అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు.. లాంటి మూడు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించిన యూవీ క్రియేషన్స్ శర్వానంద్‌కి లక్కీస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఇకపోతే ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా రాబోతుందని తెలుపుతుంది. ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపిస్తారు. శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

శర్వానంద్ తన తర్వాతి సినిమాను(#Sharwa37) సామజవరగమన తో సెన్సేషనల్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Exit mobile version