విభిన్న చిత్రాల హీరోగా పేరు దక్కించుకున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ‘రణరంగం’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. మొదటి నుండి కూడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కాజల్ మరియు కళ్యాణి ప్రియదర్శిలు నటించారు. వీరిద్దరి గ్లామర్‌తో పాటు సినిమాలో శర్వానంద్ మాస్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని సినిమాకు మాత్రం నెగటివ్ టాక్ వచ్చింది.
సినిమాకు ఉన్న బజ్ కారణంగా ముందే సినిమాకు టికెట్లు బుక్ అవ్వడం టాక్ రాకముందే సినిమా మొదటి రోజు ఆడేసింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి 4.23 కోట్ల రూపాయల షేర్‌ను దక్కించుకుంది. ఒక చిన్న హీరో ఈ స్థాయి షేర్‌ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరో రెండు మూడు రోజులు ఇదే స్థాయిలో వసూళ్లను రాబడితే ఈజీగా బ్రేక్ ఈవెన్ దక్కించుకునే అవకాశం ఉంది. కాని రణరంగం చిత్రం రెండవ రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అయినట్లుగా టాక్ వస్తుంది. రేపు ఎల్లుండి కూడా వీకెండ్స్ కనుక ఖచ్చితంగా పాజిటివ్ కలెక్షన్స్ నమోదు అవుతాయని శర్వా అండ్ టీం నమ్మకంగా ఉన్నారు.