Site icon TeluguMirchi.com

‘రణరంగం’కు ఇంకా ఎంత కావాలి?

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కాజల్‌ మరియు కళ్యాణి ప్రియదర్శన్‌లు నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది. దాదాపుగా ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 17 కోట్లకు అమ్ముడు పోయింది. మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 9 కోట్ల వసూళ్లు సాధించింది. లాంగ్‌ రన్‌లో 10 కోట్లను దాటే పరిస్థితి లేదు.

17 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం 10 కోట్ల షేర్‌ను దక్కించుకోవడంతో బయ్యర్లు ఏకంగా 7 కోట్ల వరకు నష్ట పోయారు. శర్వానంద్‌ సినిమా మినిమంగా 10 కోట్లను సాధిస్తుందని ఈ చిత్రం నిరూపించింది. దీన్ని బట్టి శర్వానంద్‌ తర్వాత చిత్రాల బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుందని అంటున్నాఉ. శర్వానంద్‌ సినిమా అంటే 15 కోట్ల లోపు బడ్జెట్‌ అయితే బాగుంటుంది. సినిమా మీడియంగా ఆడినా కూడా బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం అవుతుంది. భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తే సినిమా సూపర్‌ హిట్‌ అయినా కలెక్షన్స్‌ రాకపోవడంతో బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం కాదు. రణరంగం బ్రేక్‌ ఈవెన్‌కు 7 కోట్లు కావాల్సి ఉంది. అది రావడం దాదాపు అసాధ్యం అంటున్నారు.

Exit mobile version