రణరంగం చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో శర్వానంద్‌పై ఒక్కసారిగా అభిమాని వచ్చి పడ్డాడు. దాంతో శర్వానంద్ షాక్ అయ్యాడు. షాక్ నుండి తేరుకుని హీరోల కాళ్లపై పడవద్దు. మీ తల్లిదండ్రుల కాళ్లపై పడండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది మరీ నీచంగా ఉందంటూ కోపం తెచ్చుకున్నాడు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటం బాధాకరం అన్నాడు. ఇలాంటివి మళ్లీ జరగవద్దని కోరుకుంటున్నట్లుగా శర్వా అన్నాడు. శర్వానంద్ ఆ అభిమాని పట్ల వ్యక్తం చేసిన కోపం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.