వర్మను ఆకర్షించిన శర్వానంద్‌

sharvanadh-varmaఆవగింజంత మ్యాటర్‌ దొరికితే చాలు అందంగా రెండు గంటల సినిమాను తీసిపడేసే సంచలనాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఇప్పుడీ దర్శకుడి కన్ను ఓ తెలుగు హీరోపై పడిందట. కో అంటే కోటి సినిమాతో తాజాగా నిర్మాత అవతారమెత్తిన శర్వానందే ఆ హీరో. కో అంటే కోటి నిర్మాతగా నిరాశనే మిగిల్చినా శర్వకు కోటి రూపాయల విలువైన అవకాశాన్నందించిందనే చెప్పుకోవాలి. కో అంటే కోటి సినిమాలో శర్వానంద్‌ నటన వర్మను విపరీతంగా ఆకర్షించిందట. తాజాగా తను తెరకెక్కించబోయే తన సత్య సినిమా సీక్వెల్‌ “సత్య-2” లో శర్వాను హీరోగా తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే శర్వానంద్‌ ను సంప్రదించినట్టు కూడా ఓ వార్త. ఇదయితే ప్రస్థుతానికి అధికారికంగా ధృవీకరించబడలేదు, కానీ ఒకవేళ ఇదే కనుక నిజమయితే శర్వానంద్‌ కి “కో అంటే కోటి” మిగిల్చిన నిరాశ దూరమయిపోయి బ్రహ్మాండమైన అవకాశం దొరికినట్తే! ఆల్‌ ది బెస్ట్‌ శర్వానంద్‌!!!