Site icon TeluguMirchi.com

శర్వానంద్ నిజంగా మహానుభావుడు అనిపించుకున్నాడు..

ఫ్యామిలీ కథలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ..నిజ జీవితంలో మహానుభావుడు అనిపించుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీ ద్వారా పేద కార్మికులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సాయం అందించగా..తాజాగా శర్వానంద్ రూ. 15 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తొలిసారిగా ‘ఐయామ్ శ‌ర్వానంద్’ అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌తో సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్ల‌పై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని పేర్కొన్న ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌ల్లోనూ సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Exit mobile version