ఆ ఫొటోను షేర్ చేయడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఫొటోలను ఇంట్లో ఎలా పెట్టుకుంటారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వారి ముందు ఇలాంటి ఫొటోలు ఎలా మీరు ఉంచుతారు, ఇది ఎలాంటి సందేశంను వారికి ఇస్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు ఒక గొప్ప నటుడి భార్య అనే విషయాన్ని గుర్తించుకుని ఏ పని అయినా చేయాలి. మీరు షారుఖ్ పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల మీ కుటుంబం పరువు పోతుందంటూ మరి కొందరు ఆరోపణలు చేశారు. అయితే గౌరీ ఖాన్ మాత్రం తన ఫొటోను సమర్ధించుకుంటుంది.