Site icon
TeluguMirchi.com

శర్వా కొత్త కొత్తగా..

తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ 35 వ చిత్రం అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య స్టైలిష్ బెస్ట్ లుక్‌లో శర్వానంద్‌ను ప్రెజెంట్ చేయనున్నారు. న్యూస్ పేపర్ యాడ్ లా రూపొందించబడిన పోస్టర్‌లో శర్వా ఫంకీ, స్లీక్, ఎలిగెంట్ గా కనిపిస్తున్నారు.

ఇది చాలా ఇంటరెస్టింగ్ కాంబినేషన్. టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ #శర్వా35ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్యానర్‌లో చివరిగా విడుదలైన ధమాకా సంచలన విజయం సాధించింది. సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ ఎంత క్రేజీగా ఉండబోతుందో ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది.

Exit mobile version