శంకర్ – విజయ్ కాంబో…

సంచలన డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో విజయ్ మూవీ రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. ప్రస్తుతం విజయ్ అట్లీ డైరెక్షన్లో “బిగిల్” అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఈ చిత్రం తర్వాత విజయ్ లోగేష్ భాగ్యరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీని తర్వాత శంకర్ డైరెక్షన్లో తన 65 వ చిత్రం చేయనున్నాడని అంటున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన చర్చలు వీరి మధ్య జరుగుతున్నాయట. దీనిపైన ఇంత వరకు ఎటువంటి అధికారక సమాచారం లేనప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్ అయ్యిందని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. శంకర్ కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ తో మొదలుపెట్టిన భారీ చిత్రం “భారతీయుడు2” వివాదాల వలన ఆగిపోయిన నేపథ్యంలో విజయ్ తో సినిమా చేయాలని శంకర్ ఫిక్స్ అయినట్లు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.