Shambhala : యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే శంబాల. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్’ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Kubera : హైపెక్కిస్తున్న ధనుష్.. డ్యాన్స్ పోస్టర్ వైరల్..!
ఇప్పటికే ‘శంబాల’ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మొదలుకొని.. వరుసగా వస్తున్న అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘శంబాల’ మేకింగ్ వీడియో వదిలారు మేకర్స్. టీజర్ లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం చిత్రయూనిట్ ఏ రేంజ్ లో కష్టపడుతోందో చూపిస్తూ ఆసక్తిరేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూడబోతున్నామని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.
Also Read : Dandora : వేశ్య పాత్రలో బిందు మాధవి
ఈ శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతామని చిత్రయూనిట్ చెబుతోంది.