ప్రేమను డబ్బుతో కొనేందుకు ప్రయత్నించినా దొరకలేదు

సాదారణంగా ప్రేమను డబ్బుతో కొనలేం అంటారు. కాని షకీలా మాత్రం తాను ప్రేమ కోసం చాలా పరితపించాను. ఒకానొక సమయంలో డబ్బుతో ప్రేమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాను. డబ్బు అయితే పోయింది కాని నాకు నిజమైన ప్రేమ మాత్రం దక్కలేదని తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బుతో ప్రేమను పొందేందుకు తాను చేసిన ప్రతి ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందని, నా కుటుంబ సభ్యులు కూడా నా డబ్బు కారణంగా వదిలి వెళ్లి పోయారు.

సొంత అక్క నన్ను మోసం చేసింది, తల్లి నన్ను ఎప్పుడు కూతురు మాదిరిగా చూడలేదు అంటూ ఇంటర్వ్యూలో షకీలా ఎమోషనల్‌ అయ్యింది. నన్ను ఎప్పుడు కూడా ప్రేక్షకులు శృంగార తారగానే చూశారు. ఇప్పటికి అలాగే చూడటం వల్ల నాకు వేరే పాత్రల్లో అవకాశం రావడం లేదు. తాజాగా నేను కొబ్బరి మట్ట చిత్రంలో నటించాను. ఆ చిత్రం విడుదలైన తర్వాత నాకు మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తుందనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా షకీలా చెప్పుకొచ్చింది.