షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. డ్రాప్ 1 అంటూ టీజర్‌ని, డ్రాప్ 2 అంటూ లుట్ పుట్ గయా.. సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా డ్రాప్ 3 అంటూ మరో సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
‘నిక్లే థే కభీ హమ్ ఘర్ సే..’ అంటూ సాగే ఈ పాట మూవీపై హైప్ మరింత పెంచుతుంది. ఇంటి నుంచి దూరంగా ఉంటూ.. ఇంటిని.. తమ స్నేహితులను.. ఎంతగానో మిస్ అవుతున్నామని ఫీలయ్యే ప్రతి ఒక్కరి మనసుని తాకేలా ఈ పాట సాగింది. అంతేకాదు ఆ ఎమోషన్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ సాంగ్ ను ప్రీతమ్ చక్రవర్తి కంపోజ్ చేయగా.. సోను నిగమ్ తన గాత్రం తో పాటకు ప్రాణం పోశాడు అని చెప్పవచ్చు. జావెద్ అక్తర్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.
ఇదిలా ఉండగా ఈ లేటెస్ట్ డ్రాప్ గురించి షారుక్ ఖాన్ ఓ ఎమోషనల్ క్యాప్షన్ ఉంచాడు. “ఇవాళ ఎందుకో నా మనసుకు తోచింది. దీంతో ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాజు, సోనూ పేర్లు వింటే మన వాళ్లే అన్న భావన కలుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ పాట కూడా మన వాళ్లదే. మన ఇంట్లోని వాళ్ల జ్ఞాపకాలది. మన మట్టిది. మన దేశం ఒడిలో ఓ రకమైన హాయి దొరుకుతుంది. మనమందరం ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి, ఊరి నుంచి, పట్టణం నుంచి దూరంగా వెళ్తాం. మన జీవితం కోసం. కానీ మన మనసులు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాయి. డంకీలో ఈ సాంగ్ నా ఫేవరెట్” అని షారుక్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించారు.