Site icon TeluguMirchi.com

షాడో… ఓ సిస్ట‌ర్‌ సెంటిమెంట్ సినిమా

Venkatesh-Shadow-Movieవెంక‌టేష్ గెట‌ప్పూ ఆ సెట‌ప్పూ చూసి షాడో ఏదో.. మాఫియా క‌థ అనుకొంటున్నారు. కానీ మాఫియాకీ ఈ సినిమాకీ ఎలాంటి క‌నెక్షనూ లేద‌ని వెంక‌టేష్ తేల్చేశారు. ఇదో రివైంజ్ డ్రామా. అయితే కాస్త స్టైలిష్‌ గా ఉంటుంది. సాధార‌ణంగా వెంకీ సినిమాల్లో సెంటిమెంట్ సన్నివేశాల‌కు ఎక్కువా స్కోప్ ఉంటుంది. ఇందులోనూ సిస్టర్ సెంటిమెంట్ బాగా ద‌ట్టించార‌ట‌. ఇంత‌కీ వెంకీ చెల్లాయి ఎవ‌ర‌నుకొంటున్నారు…? మ‌ధురిమ‌. వీరిద్దరి మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాలు కంటిత‌డి పెట్టిస్తాయ‌ని స‌మాచారం. వెంకీ ఏడిపించిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్టే. అదే సెంటిమెంట్ ఈ సినిమాకీ వ‌ర్కవుట్ అయితే.. షాడో సినిమా అదిరిపోయిన‌ట్టే.

Exit mobile version