Site icon TeluguMirchi.com

‘షాడో’ ఆడియో రిలీజ్ డేట్

shadow audio on march 15మెహర్ రమేశ్ దర్శకత్వంలో వెంకటేష్, తాప్సీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షాడో’ చిత్రం ఆడియో మార్చి 15న విడుదల సిద్దమైంది. శ్రీకాంత్, మధురిమలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ తమన్ సమకూర్చారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని స్టైలిష్ గా తెరకెక్కించాడని యూనిట్ సభ్యుల సమాచారం. అయితే బడ్జెట్ మాత్రం మొదట అనుకున్న దానికంటే అధికంగానే ఖర్చు జరిగిందట. యాక్షన్ ఎపిసోడ్స్, ఫారిన్ లొకేషన్స్ సినిమా బడ్జెట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోయాయని టాక్. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి ప్రాధాన పాత్రలలో పోషిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి శివరామప్రసాద్
నిర్మిస్తున్నారు.

Exit mobile version