Site icon TeluguMirchi.com

రాజమౌళి చూసి కుళ్ళుకుంటున్న బాలీవుడ్ నిర్మాతలు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం రాజమౌళి గురించి గొప్పగా చెపుతున్నారు..ఇక అన్ని ఇండస్ట్రీ ల హీరోలైతే రాజమౌళి లాంటి డైరెక్టర్ తో ఒక్క సినిమా చేసిన చాలు అని పబ్లిక్ చెపుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 యావత్ సినీ ప్రపంచం లో ఓ మైలు రాయి గా నిలిచిపోతుందని తెలుస్తుంది..ఈ గొప్పతనం చూసి బాలీవుడ్ దర్శక , నిర్మాతలు కుళ్ళుకుంటున్నారు. ఓ తెలుగు డైరెక్టర్ అంత పేరు రావడం ఏంటి అది ఎలా సాధ్యం అయ్యిందంటూ మాట్లాడుకుంటున్నారు. కేవలం వీరు మాత్రం కాదు హాలీవుడ్ స్థాయి డైరెక్టర్స్ సైతం బాహుబలి 2 చిత్రాన్ని చూసి రాజమౌళి ని మెంచుకోకుండా ఉండలేకపోతున్నారట.

ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోల దగ్గరి నుండి దర్శకులు , నిర్మాతలు నటి నటులంతా ఏనాడో మన తెలుగు పరిశ్రమ చేసుకున్న పుణ్యమో రాజమౌళి లాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీ కి దొరకడం అంటూ గొప్పగా చెపుతున్నారు. రాజమౌళి పుణ్యమా అని యావత్ సినీ లోక తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇక ఇప్పటి నుండే రాజామౌళి నెక్స్ట్ ఏ చిత్రం చేస్తాడా అని ఆరా తీయడం స్టార్ట్ చేశారట..ఇంత గొప్ప పేరు తెచ్చిన జక్కన్న కు అందరూ జయహో రాజన్న అనాల్సిందే.

Exit mobile version