సాఫ్ట్ డైరెక్టర్ తో బన్నియాక్షన్…!

Allu-Arjun-Sekhar2014లో రేసు గుర్రం తో మంచి రేసు లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్నాడు. ఇందులో బన్నీ కి జోడి గా ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నారు. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ వేసవిలో ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది.. ఇదిలా ఉంటె తెలుగు ఇండస్ట్రీ లో సాఫ్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల కు బన్నీ జెండా ఊపాడు అని ఫిలిం నగర్ లో వార్త వినిపిస్తుంది.

శేఖర్ కమ్ముల చెప్పిన కథ బన్నీ కి బాగా నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ ని డెవలప్ చెయ్యమని చెప్పినట్లు సమాచారం. ఇది ఓకే అయితే శేఖర్ కమ్ముల కూడా కమర్షియల్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టిన పేరు వస్తుంది.