టాలీవుడ్లో ‘నిజం’, ‘ఇడియట్’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’ చిత్రాలతో పాటు ఇంకా పలు చిత్రాల్లో నటించిన రక్షితకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈమె కొన్నాళ్లకే ఫేడ్ అవుట్ అయ్యింది. ‘అందరివాడు’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన తర్వాత రక్షిత పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా రక్షిత మళ్లీ మీడియా ముందుకు వచ్చింది. అయితే మునుపటి రక్షితకు ఈ రక్షితకు ఎక్కడ పోలిక లేకుండా ఉంది.
హర్మోన్ సమస్య కారణంగా రక్షిత విపరీతంగా బరువు పెరిగింది. ప్రస్తుతం 100 కేజీలకు పైగానే ఈ అమ్మడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రైవేట్ కార్యక్రమాల్లో తన సన్నిహితులతో పాల్గొంటుంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రక్షిత ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది వైధ్యులను సంప్రదించినా కూడా రక్షితకు పరిష్కారం దొరకడం లేదట. పాపం ఇలా ఉండే రక్షిత ఎలా అయ్యిందో చూడండి…!