వర్మను బెదిరించారు!

ramgopal-varmaభయం అనే ఎమోషన్ తో ఆడుకోవడం దర్శకుడు రాంగోపాల్ వర్మ కు కెమరా తో పెట్టిన విద్య. క్రైమ్, త్రిల్లర్స్ చిత్రాలను తీసి ప్రేక్షకులను భయ పెట్టడం వర్మ కు ఓ హాబీ. భయ పెట్టడం తప్పితే భయపడడం తెలియని వర్మకు తాజాగా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. అవును నిన్న (గురువారం ) వర్మ కు కొందరి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి బెదిరించారు. అయితే ఇలాంటి బెదిరింపులు వర్మ కు కొత్తేం కాదు. కాని ఈ సారి మేటర్ కాస్త సీరియస్. అందుకే పోలీసులను ఆశ్రయించాడు. తనకి సెక్యూరిటీ ఇవ్వమని వారిని కోరాడు.

‘నాకొచ్చిన బెదిరింపులు రిత్యా ముంబై పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు. ఈ కాల్స్ లో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల అది నేను చెప్పలేను. అయితే సత్య 2 గురించి అయితే కాదని’ వర్మ ట్వీట్ చేశాడు.

అయితే వర్మని టార్గెట్ చేసింది ఎవరు? అని విషయం తెలిసిరాలేదు. కాని వర్మ భయపడే రేంజ్ లో బెదిరింపులు వుండడం విశేషం.