Site icon TeluguMirchi.com

రజనీ, కమల్ ఫై మండిపడ్డ కట్టప్ప..

బాహుబలి చిత్రంలో కట్టప్ప గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్..తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ , కమల్ హాసన్ ఫై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాట రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ కి దగ్గరిగా ఉంటాయి. సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినీ తారలే ప్రభుత్వాలు ఏర్పటు చేయడం.. ప్రస్తుతం వాటిని వారే చూసుకోవడం తో ప్రజల్లో రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రకటించడం..కమల్ హాసన్ సైతం మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడం ఫై సత్యరాజ్ స్పందించారు.

తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పండిందని రాజకీయాల్లోకి వచ్చిన కమల్, రజనీకాంత్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన డీఎంకే లాంటి పార్టీని పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాజకీయాలు చేయడానికి చాలామంది ఉన్నారని, ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని ఘాటుగా స్పందించారు.

Exit mobile version