త్రిష ‘మైండ్ గేమ్’ ఎలా ఉండబోతుందో..

Sathuranga-Vettai-2ఇటీవల కాలం లో త్రిష జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తోంది..ఇప్పటికే 30 + కు వచ్చిన కానీ యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తూ , వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తన హావ ను కొనసాగిస్తోంది..ఇటీవలే ధనుష్ సరసన కోడై మూవీ ( తెలుగు లో ధర్మ యోగి ) మూవీ లో నెగిటివ్ పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు అందుకున్న ఈమె , త్వరలో అరవింద్ స్వామి తో రొమాన్స్ చేయబోతుంది.

Also Read :
వరుణ్ తో త్రిష ఎందుకు విడిపోయిందో తెలుసా ?

‘సతురంగ వెట్టై 2’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైండ్ గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మల్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇందులో త్రిష లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సతురంగ వెట్టై తొలి పార్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ పై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.